బేగంపేట్ ఫ్లై ఓవర్ కింద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం…………

బేగంపేట ఫ్లైఓవర్ కింద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది. ఈనెల 24వ తేదీ పెట్రోల్ కార్ వన్ లో విధులు నిర్వహిస్తున్న శివ సాయి పిసి కి స్థానికులు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని పరిశీలించగా ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో పడి ఉండటాన్ని గమనించారు. ఆ వ్యక్తి గురించి స్థానికంగా విచారించగా అతను బిచ్చగాడు అని వారు స్పష్టం చేయడంతో బేగంపేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుని వయస్సు సుమారు 45 సంవత్సరాలు వుంటుందని, ఎత్తు 5.4 అడుగులు, అతని ఎడమ కాలుకు గతంలో గాయాలైనట్లు గుర్తులున్నాయి. ఛాతిపై కుడి వైపున పుట్టుమచ్చ ఉంది. వెంటనే మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. మృతుని గుర్తించిన వారు బేగంపేట పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఎస్సై జయ చందర్ తెలియజేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *