విభిన్న రకాల ఈవెంట్స్ నిర్వహణ కోసం ప్రముఖ సినీ నటుడు ఆదిత్య మీనన్, పూనమ్ సింగ్ బక్షిల ఆధ్వర్యంలో తీసుకుని వచ్చిన బక్షి అండ్ మీనన్ ఎంటర్ టైన్మెంట్ ప్రారంభోత్సం శనివారం కన్నుల పండువగా జరిగింది. మినిష్టర్రోడ్ లోని ఇలాచీ రెస్టారెంట్లో జరిగిన ఈ కార్యక్రమంలో సినీనటుడు ఆదిత్య మీనన్, బుల్లితెర నటుడు సెల్వరాజ్ తో పాటు పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లు, మోడల్స్ మధ్య కన్నుల పండువగా సాగింది. ఈ సందర్భంగా ఆదిత్య మీనన్ మాట్లాడుతూ బారీ ఫంక్షన్లు, పెళ్లిళ్లు, ఈవెంట్స్, లైవ్ కన్సెర్ట్ ,పెద్ద పెద్ద సినీ తారలు, సెలబ్రిటీలతో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. తాను సినిమాలకు రాక ముందు ఈవెంట్స్ చేసేవాడినని సుమారు 500 వరకు ఈవెంట్స్ నిర్వహించిన అనుభవం తనకు ఉందన్నారు. ఇదే రంగంలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న పూనమ్ సింగ్ బక్షి అనుభవం మరింత ఉపకరిస్తుందన్నారు. హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ స్లాంగ్ లో స్టాండప్ కామెడిని వినోద ప్రియులకు మరింత చేరువ చేసేందుకు కామెడి క్లబ్ ను తీసుకుని వచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో ఇలాచీ రెస్టారెంట్ అధినేత మహిప్ జైన్, యూనిట్ 72 డైరెక్టర్ దర్శిక సింగ్ తదితరులు పాల్గొన్నారు.

