మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలి -జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ

రైతులు పండించిన మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని ఉమామహేశ్వర గ్రామంలోని మిర్చి పంటలను శనివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో మిర్చి క్వింటా ధర రూ.23 వేలు ఉందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మిర్చి రూ.12 వేలుగా ఉందన్నారు. పెట్టుబడి రాక రైతులు అప్పులు ఊబిలో కూరుకుపోతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో విఫలమైందన్నారు. రైతు భరోసా కింద నగదు వేస్తామని చెప్పారే కానీ ఆచరణలో చేయలేదన్నారు. ప్రభుత్వ ఎకరాకి నష్టపరిహారం కింద రూ. 20వేలు అందజేయాలన్నారు. ముందుగా మారెళ్ల గ్రామంలో గుండెపోటుతో మృతి చెందిన చొప్పరపు కోటేశ్వరావు కుటుంబ సభ్యులను, ఉమామహేశ్వరపురంలోని సాధు కోటిరెడ్డి కుటుంబాన్ని, ఎస్సీ
కాలనీలోని ఎలుగందల దెబ్బయ్య కుటుంబాన్ని, వరిగాని సీతమ్మ కుటుంబాన్ని, చొప్పవరపు గోవిందు వెంకటేశ్వర్లు కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మాజీ కన్వీనర్ సూది దేవర అంజయ్య, జడ్పీటీసీ తాతపూడి మోజేష్ రత్నం రాజు, సుంకర బ్రహ్మానంద రెడ్డి, బంక నాగిరెడ్డి, అబ్బనీ అంజిరెడ్డి, ఇరుగుల కొండారెడ్డి, గోపన్న బోయిన శ్రీనివాసరావు, బిజ్జం కృష్ణారెడ్డి, గొంది వెంకట అప్పారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *