దర్శి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాదొడ్డి అన్నారు. దర్శి ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశం డాక్టర్ సుమన్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బూచేపల్లి మాట్లాడుతూ…. ఆసుపత్రిలో అవసరమైన పరికరాలు కొనుగోలు చేయాలని కోరారు. మందులు అవసరమైనవి తెప్పించుకోవాలని సూచించారు. మార్చురీ రూమును ఏర్పాటు చేసుకునే విధంగా దాతల ద్వారా నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ సోనార్ బాబు, సంఘ సేవకులు జీవి రత్నంతో పాటు వైద్యులు గీతా, పద్మ, సుప్రియ పాల్గొన్నారు.

