ఒంగోలుపార్లమెంట్ టీడీపీ కార్యనిర్వ
హక కార్యదర్శి, టీడీపీ సీనియర్ నేత శాగంకొండారెడ్డిని దర్శి నియోజకవర్గ టీడీపీ నేత డాక్టర్ లలిత్ సాగర్ ,దర్శి మున్సిపల్ చైర్మన్ నారపు శెట్టి పిచ్చయ్య, టీడీపీ నేతలు వెలుగువారిపాలెం వెళ్లి మంగళవారం పరామర్శించారు. కొండారెడ్డి గత 20 రోజు లుగా అనారోగ్యంలో చికిత్స పొందుతూ ఇంటి వద్ద వుండగా పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై వాకబు తీశారు. మెడికల్ రిపోర్టులను డాక్టర్ లలిత్ సాగర్ పరిశీలిం చారు.మెదడులో రక్తం స్వల్ప పరిణామంలో క్లాట్ అయిందని, మెడిసిన్ వాడితే, తగ్గిపోతుందని, ఆందోళన చెందక ఇంటిపట్టునే కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసు కోవాలని సూచించారు. ఆయనవెంట దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య , తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు, ఒంగోలుపార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, టీడీపీ నేతలు మేడగం వెంకటేశ్వరరెడ్డి, వీరనాగిరెడ్డి,గోవిందరెడ్డి, కోటయ్య, లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.
