వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా
ప్రభుత్వం క్వాస్ కార్యక్రమం ద్వారా గ్రామాల్లోని బోర్లకు మరమ్మత్తులు చేస్తున్నట్లు ఎంపీడీవో దారా హనుమంతరావు తెలిపారు. రామభద్రాపురం గ్రామంలో క్వాస్ పధకం కింద చేతి పంపులకు మరమ్మత్తులు చేస్తుండగా మంగళవారం పరిశీలిం చారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ…. గ్రామాల్లో బోర్లు, చేతిపంపులు చెడిపోయి వున్నా, పని చేయక పోయినా ఎంపీడీవో కార్యాలయంలో,సచివాలయంలో తెలియ పరచాలన్నారు. గ్రామాల్లోకిమెకానిక్ లు వచ్చిమరమ్మత్తులు చేస్తారన్నారు. వేసవిలో. నీటి ఎద్దడిలేకుండా చర్యలు చేపట్టారన్నారు.
