సమ సమాజ స్థాపనకు సంకల్పించి పట్టువిడువని పోరాట పటిమతో బాధ్యతాయుతమైన దేశభక్తి భావజాలాన్ని భవిష్య తరాలకు అందించాలనే గొప్ప ఆలోచన కలిగి నేటి స్వేచ్చాయుత భారతానికి నాడు పునాదులు వేసిన మహనీయులు శ్రీ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి విజయరావు తెలిపారు.
మంగళవారం వారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునిస్మరించుకుంటూ ఒంగోలు నగరంలోని రాంనగర్ మొదటి వీధిలో ఒంగోలు మండల అధ్యక్షురాలు దేవరపల్లి శ్రీలక్ష్మి అధ్యక్షతన జరిగిన సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బి. విజయరావు మాట్లాడుతూ… జాతీయవాది, స్వేచ్ఛా భారతావనికై విశేష కృషిచేసిన పండిత దీన దయాళ్ ఉపాధ్యాయ్ మహోన్నతవ్యక్తీయని, వారిబాల్యమంతా కడుకష్టాలమయమైనా వారుకలగన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి దేశమంతటా పర్యటిస్తూ అందరిలో స్ఫూర్తి కలిగించారని, పత్రిక విలేఖరిగా వివిధ పత్రికలను ప్రారంభించి దేశప్రజలలో దేశభక్తి, జాతీయ భావ జాలమును పెంపొందించారని, వారి కృషితోనే దేశం స్వేచ్ఛ, సుభీక్షంగా ఉందని, దీనదయాళ్ వంటి దేశభక్తులు మరో ఇద్దరు ఉంటే దేశరాజకీయ చిత్రాన్నేమార్చివేస్తారని డా. ముఖర్జీ అన్నారని గుర్తుచేశారు. దీనదయాళ్ ఉపాధ్యాయ మార్గం దేశ ప్రజలందరికీ శిరోధార్యం అని మీడియాకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా ఇంచార్జ్ తీగల సత్యవతి, జిల్లా కార్యవర్గ సభ్యులు ధనిశెట్టి పావని దార్మిమిక సెల్ కన్వీనర్ సీతారామయ్య తదితరులు పాల్గొని ఈ కార్యక్రమంలో విజయం చేసినారు.

