విధి నిర్వహణలో క్రమశిక్షణతో నడుచుకోవాలని బేగంపేట ఏసిపి గోపాల కృష్ణమూర్తి అన్నారు. బేగంపేట పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్స్ గా విధులు నిర్వర్తిస్తున్న శంకరరావు, ఏసుబాబు, లచ్చయ్యలు ఏఎస్ఐలుగా పదోన్నతి పొందారు.ఈ సందర్భంగా వారు బుధవారం ఏసిపి కార్యాలయంలో ఏ సి పి గోపాలకృష్ణమూర్తిని కలిశారు. ఈ సందర్భంగా ఏసిపి వారిని శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలతో మమేకమవుతూ వారి అభిమానాన్ని చూర గొనాలని అన్నారు.
