ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో అనంతపురంలో రాష్ట్ర మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రకాశంజిల్లా పోలీస్ శాఖకు తరపున 30 ప్లస్ ఏజ్ గ్రూప్ విభాగంలో పోలీసులు వివిధ విభాగాలలో తమ ప్రతిభను చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని విశేష ప్రతిభ కనబరిచి పలు పతకాలు కైవసం చేసుకున్న ఆర్.ఎస్.ఐ సురేష్ మరియు కానిస్టేబుల్ ను జిల్లా ఎస్పీ ఏ. ఆర్ దామోదర్ ప్రత్యేకంగా అభినందించి సర్టిఫికెట్స్ మరియు మెడల్స్ ను ఎస్పీ అందచేసినారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీలలో పతకాలు సాధించిన ఏ. ఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఆర్. ఎస్. ఐ సురేష్ 100m, 200M, లాంగ్ జంప్ 4x100m మరియు 4x 400M లో వరుసగా 4 గోల్డ్,1 సిల్వర్ మెడల్స్, 2) కె. శ్రీనివాసరావు(PC.973) 400m, 800M,4X100m, హై జంప్ మరియు 4X400m వరుసగా 4 గోల్డ్,1 సిల్వర్ మెడల్స్ సాధించారు.
ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ ఏ. ఆర్ దామోదర్ మాట్లాడుతూ…. ఒకవైపు జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూనే మరోవైపు క్రీడల పట్ల ఆసక్తితో నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ పతకాలు సాధించి ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ ఖ్యాతిని ఇనుమడింపజేయడం గర్వకారణమని, అలాగే త్వరలో బెంగుళూరు లో జరగనున్న జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలో కూడా సత్తా చాటి జిల్లా పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్టలు పెంచాలని కోరారు. జిల్లా పోలీస్ శాఖలో ప్రతిభ గల పోలీస్ సిబ్బంది క్రీడలలో పాల్గొనాలన్నారు. సిబ్బందిలో ఉన్న క్రీడా కౌశల్యాన్ని గుర్తించి, తద్వారా వారిలో పోటీతత్వాన్ని సహకారాన్ని పెంపొందిస్తామని, క్రీడలలో వారికి ప్రోత్సాహం అందిస్తూ అన్ని విధాలా సహకారం అందిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎఆర్ డిఎస్పీ కె.శ్రీనివాసరావు, ఆర్ఐలు రమణారెడ్డి, సీతారామిరెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.



