ఆధ్యాత్మిక యాత్రలకు ఆంధ్రప్రదేశ్ టూరిజం ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేసిందని ఏపి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డా. నూకసాని బాలాజీ తెలిపారు.ఉత్తర్ ప్రదేశ్ ప్రయగరాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళ లో పాల్గొను యాత్రికుల సౌకర్యం కోసం ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ రెండు ఏ.సి బస్ లను ఏర్పాటు చేసిందని మొదటి బస్ నెల్లూరు నుండి ఒంగోలు విజయవాడ మీదగా రాజమండ్రి, విశాక పట్నం, ఒరిస్సా నుండి ఉత్తర్ ప్రదేశ్ లోని కాశీ,ప్రయగరాజ్,ఇతర తీర్థ యాత్ర దేవాలయాలకు భక్తుల కోసం వసతులు, ఆహారం సౌకర్యంతో మల్టీ యాక్సిల్ ఏ.సి బస్ ఈ రోజు ఒంగోలు నుండి టూరిజం కార్పొరేషన్ ట్రాన్స్పోర్ట్ జనరల్ మేనెజర్ శశిధర్ తో కలసి హోటల్ సరోవర్ వద్ద ప్రారంభించినట్లు డా. బాలాజీ తెలిపారు.ఈ సందర్బంగా డా బాలాజీ మీడియా తో మాట్లాడుతూ ….ఆంధ్రప్రదేశ్ టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు . ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలు ఆలయాలకు పర్యాటకులు, భక్తులు సందర్శించే విధంగా నూతన టూరిజం ప్యాకేజీలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు అలాగే తిరుపతి నుండి అరుణాచలం, తిరుపతి నుండి బెంగుళూరు, మైసూర్,ఊటి, తిరుపతి నుండీ చెన్నై ఊటి, విశాఖపట్నం నుండి లంబసింగి, అరకు అన్నవరం సింహాచలం, శ్రీ శైలం, విజయవాడ మొదలగు ప్రాంతాలకు టూరిజం శాఖ తరపున బస్సులు, వసతి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామని డాక్టర్ బాలాజీ తెలిపారు . భారత దేశంలోనే ఆంధ్రప్రదేశ్ టూరిజం ఒక రోల్ మోడల్ గా ఉండే విధంగా టూరిజం కార్పొరేషన్ ని అభివృద్ధి చేస్తున్నట్టుగా డాక్టర్ బాలాజీ తెలిపారు . టూరిజం శాఖ కందులు దుర్గేష్ సలహాలు సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ అనేక కొత్త టూర్ ప్యాకేజీలు రానున్న వేసవి వేసవికాలంలో ఏర్పాటు చేసి పర్యాటకుల్ని ఆకర్షిస్తామని డాక్టర్ బాలాజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ టూరిజం కార్పొరేషన్ ట్రాన్స్పోర్ట్ జనరల్ మేనేజర్ శశిధర్, ఏపీ టూరిజం డివిజనల్ మేనేజర్ శ్రీనివాసరావు, ఏపీ టూరిజం సిఆర్ఎం టీవీఎస్ ప్రసాద్, ఏపీ టూరిజం పిఆర్ఓ వై రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు


