మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ
పధకం కింత కూలీలకు పనులు కల్పిస్తూ ఉపాధిపనులను వేగవంతం చేయాలని ఎంపీడీవో డి.హనుమంతరావు తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ పధకం సిబ్బంది, ఫీల్అసిస్టెంట్లతో బుధవారం సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఉపాధి కూలీలకు పనులు కల్పించాలన్నారు. నిత్యం ఉపాధి పనులకు కూలీలు వచ్చే విధంగా ఎస్ఏలు ప్రణాళికలు రూపొందించాలన్నారు. గ్రామాల్లో కూలీలకు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని, వారిని గుర్తించి పనులు కల్పించాలన్నారు. ఉపాధి పనులకుకూలీల సంఖ్యను పెంచటంలో ఎస్ఏలు అసత్యం ప్రదర్శిస్తే చర్యలు తప్పవన్నారు.జాబ్ కార్డు ఉన్న ప్రతికూలికి పని కల్పించాలన్నారు. ఈకార్య క్రమంలోఏపీవో పాల్గొన్నారు. బి.మురళి,ఈసీగురుబాబు,టీఏలు,ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
