ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 75 వసతి గృహాలలో 58 ఫ్రీ మెట్రిక్ వసతి గృహా విద్యార్థులు 5729 మందికి స్టేషనరీ, టవల్స్ పంపిణీ చేయనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్ లక్ష్మా నాయక్ తెలిపారు. 75 వసతి గృహాలలో ఉన్నటు వంటి ప్రతి విద్యార్థిని ఒక టవల్ చొప్పున 7527 టవల్స్,, 4179 స్టేషనరీ సామగ్రి సహాయ సంక్షేమాధికారి కార్యాయాలకు పంపినట్లు తెలిపారు. విద్యార్థులకు సంబంధిత సామగ్రి సక్రమంగా అందజేసి వారి విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు.
