“యువతతో రైతుకు ఉజ్వల భవిష్యత్తు” పుస్తకావిష్కరణ – విశ్వమాత సోషల్ సర్వీస్ సొసైటీ వారిచే ఎస్ఎస్ఎన్ విద్యార్ధులకు ప్రశంసాపత్రాల బహూకరణ.

ఫిబ్రవరి 6వ తేదీ స్థానిక మంగమ్మ కళాశాల ప్రాంగణంలో విశ్వమాత సోషల్ సర్వీస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో జరిగిన 108 గోవుల పూజా మరియు ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని, సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శాస్త్రీయనృత్యాలు చేసిన ఎస్ ఎస్ ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు 40 మందికి ప్రశంస పత్రాలను జ్ఞాపికలను మంగమూరు రోడ్డు ఎస్ఎస్ఎన్ కళాశాల డైరెక్టర్ మరియు ప్రిన్సిపాల్ సత్యనారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి ఆధ్వర్యములో కళాశాల ప్రాంగణంలో జరిగిన సమావేశంలో విశ్వమాత సోషల్ సర్వీస్ సొసైటీ సంస్థ కార్యదర్శి కమ్మిశెట్టి వెంకట రత్నదీప్ అందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన అగ్రికల్చర్ ఏడి వి సుభాషిణి “యువతతో రైతుకు ఉజ్వల భవిష్యత్తు” అన్న పుస్తకమును ఆవిష్కరణ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతు లేనిదే రాజ్యం లేదని రైతే దేశానికి వెన్నుముక అని కావున పంటలు పండించే రైతుని గౌరవించాలని గోమాతలను సంరక్షించాలని తెలిపారు కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కమిసెట్ రమేష్ ఉపాధ్యాయురాలు లక్ష్మి మరియు కళాశాల అధ్యాపకులు టి రాజేంద్రప్రసాద్ పి రవితేజ మరియు రాజశేఖర్ రెడ్డి పి నీలిమ ఎస్కే నిరోషా తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *