దామోదరం సంజీవయ్య 105వ జయంతి ఉత్సవాలు జిల్లాలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, సాంఘిక సంక్షేమ శాఖ ఆద్వర్యంలో నిర్వహించనున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటి డైరెక్టర్ ఎన్ లక్ష్మా నాయక్ తెలిపారు. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ముఖ్య అతిథిగా పాల్గొననున్నట్లు చెప్పారు. ఒంగోలు లోని ప్రకాశం భవనం ఎదుట ఉన్న దామోదరం సంజీవయ్య విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించనున్నట్లు చెప్పారు. కావున జిల్లాలోని అధికారులు, దళిత నాయకులు, ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని కోరారు.
