ప్రతి రైతుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను
చేయటానికి రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య ప్రామాణిక మౌతుందని వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. లక్కవరం గ్రామంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆధార్ ఎంత అవసరమో వ్యవసాయ అనుబంధ శాఖల పధకాల అమలుకు విశిష్ట గుర్తింపు సంఖ్య అంతే అవసరం అవుతుందని అన్నారు. ప్రతి రైతు నివాసంలో ఎంత మంది పేరుతో పొలం ఉంటుందో అంత మంది విశిష్ట సంఖ్యను పొందాలని చెప్పారు. రైతులు తమ సమీపంలోని రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్లి భూమి పాస్ బుక్, ఆధార్, ఆధార్ నంబర్‌కు లీక్ అయిన మొబైన్ నంబర్ తీసుకువెళ్లి ఓటీపీ లు చెప్పి విశిష్ట సంఖ్య ను పొందాలని సూచించారు, విఏఏ వీరాంజ నేయులు తదితరులు పాల్గొన్నారు.
