తల్లిదండ్రులు చిన్నారులను గమనిస్తూ వారి కంటి చూపు పై ప్రత్యేక శ్రర్థ తీసుకోవాలని ఒంగోలు మోడరన్ ఐ హాస్పటల్ చైర్మన్ డాక్టర్ ఎం వెంకట రమణా రెడ్డి అన్నారు. తాళ్లూరు ఎబీసీ హైస్కూల్లో శుక్రవారం ఒంగోలు మోడరన్ కంటి వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కంటి వైద్య నిపుణులు వెంకట రమణా రెడ్డి, డాక్టర్ డి అర్పణ షాషర్ ఆధ్వర్యంలో 619మందికి కంటి పరీక్షలు నిర్వహించి దృష్టి లోపం ఉన్న 54 మందిని గుర్తించారు. పాఠశాల కరస్పాండెంట్ టి శ్రీనివాస రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు ఎం వెంకటేశ్వర రావు, డైరెక్టర్ కె కాలేషా బాబు, పిఆర్ సురేంద్ర, టెక్నిషియన్ కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.

