బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత

బాలలహక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని తహసీల్దార్ జె.ఇమ్మానియేల్ రాజు అన్నారు. బంగారు బాల్యం కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి అధికారుల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్బంగా తహసీల్దార్ రాజు మాట్లాడుతూ….బాల్య దశ నుండే పిల్లలు చెడుమార్గాలవైపు వెళ్లకుండా సత్ప్రవర్తనతో ముందుకు సాగేలా చూడాలన్నారు.బాల్యదశనుండి బంగారు భవిష్యత్తునునాశనం చేసుకోకుండా చూడాల్సిన భాధ్యత అందరిపై వుందన్నారు. విద్యార్థుల అభ్యున్నతకోసం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకునేలా, విద్యారుల భవిష్యత్తుకుబంగారు బాటలు వేసుకునేలా చూడాలన్నారు. గ్రామాల్లో బాల్యవివాహాలు జరుగకుండా చూడాలన్నా రు. ఈకార్యక్రమంలో కార్యాలయ ఏ. ఓ సానికొమ్ము సత్యం, వ్యవసాయాధికారి బి.ప్రసాద రావు , వైద్యాధికారి రాజేష్ యాదవ్, ఏపిఎమ్ దేవరాజ్, అంగన్వాడీ సూపర్ వైజర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *