పుల్వామా అమరవీరుల స్మరణదినోత్సవం- వాసవిక్లబ్ ఒంగోలు మరియు వాసవిక్లబ్ ఒంగోలు సిటిజెన్స్ ఆధ్వర్యములో ఘనంగా అమరవీరుల దినోత్సవము.

జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ ప్రేరేపిత జై షే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ జరిపిన ఆత్మాహుతి దాడిలో సి ఆర్ పి ఎఫ్ 40 మంది జవానులు మరణించిన సందర్భంగా భారతదేశమంతటా ఫిబ్రవరి 14న బ్లాక్ డే గా జరుపుకుంటుందని, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఒంగోలు నగరంలోని బండమిట్ల సెంటర్లోని కార్గిల్ స్థూపం వద్ద వాసవి క్లబ్ ఒంగోల్ సిటిజన్స్ మరియు వాసవి క్లబ్ ఒంగోలు సంయుక్త ఆధ్వర్యంలో అమర జవానులకు నివాళులర్పించామని క్లబ్ అధ్యక్షులు భూమా శ్రీనివాసులు ఒంగోలు క్లబ్ అధ్యక్షులు కొప్పురావూరి భరత సింహా లు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

శుక్రవారం సాయంత్రం కార్గిల్ స్థూపంవద్ద అమరులైన వీర జవానులకు కొవ్వొత్తులు వెలిగించి నివాలు అర్పించి జోహార్లు పలికారు.

కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు భూమా శ్రీనీవాసులు, కొప్పురావూరి భరత్ సింహ, కార్యదర్శులు మద్దాలి శివప్రసాద్, కోశాధికారులు మరియు జోన్ ఛైర్మన్ పబ్బిశెట్టి గోవర్ధన్, రీజియన్ ఛైర్మన్ సిహెచ్ సత్యనారాయణ, అధికారులు దర్శి మనోహర్ చంద్రశేఖర్, నేరెళ్ల శ్రీనివాసరావు, రాధా రమణ గుప్తా జంధ్యం, స్వర్ణ సాయి, తదితరులు పాల్గొని అమరవీరుల త్యాగాలను స్మరించుకొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *