పుల్వామా ఉగ్రదాడిలో అసువులు బాసిన సి ఆర్ పి ఎఫ్ జవాన్లకు బేగంపేట బిజెపి నాయకుల ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ బిజెపి నాయకులు నెమలి ఆనంద్ (నందు) మాట్లాడుతూ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సిఆర్పిఎఫ్ జవానుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి చిత్రపటాల వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు.ఈ చర్య హేయమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఆనంద్, విజయ్ కుమార్ మహేష్ కుమార్ వెంకటేష్ యాదవ్ పాండియన్ ఎం నాగేష్ తారకంపేట శ్రవణ్ కుమార్, వేణు గణేష్ మధుసూదన్ రావు శ్రీరామ్ బాబురావు మహేష్ లోహిత్ తదితరులు పాల్గొన్నారు.


