ఆర్ బి షొటోకాన్ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ వారి సౌజన్యంతో అద్దంకి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన ఆలిండియా ఓపెన్ కరాటే ఛాంపియన్ పోటీలో తమ స్కూల్ విద్యార్థులు పలు విభాగాలలో మొదటి రెండు మూడు స్థానాలలో 21 మంది విద్యార్ధులు విజయం సాధించారని స్థానిక రామనగర్ 8వ లైన్ లోని బిఆర్ ఒలంపియాడ్ స్కూల్ ప్రిన్సిపాల్ కే దిలీప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్కూల్ కార్యాలయంలో జరిగిన అభినందన కార్యక్రమంలో కరాటే మాస్టార్ వెంకారెడ్డి మరియు విద్యార్థులను అభినందించి సత్కరించారు.
ఈ సందర్భంగా వివరాలు తెలుపుతూ 3వ తరగతి కావ్య మొదటి 5వ తరగతి విద్యార్ధిని అక్షిత రెండవ స్థానం, 6వ తరగతి విద్యార్ధి రిత్విక రెండవ స్థానం, 7వ తరగతి విద్యార్ధులు అభిరాం, సుధీర్ మహంత్ మీనన్ లు మొదటి, జస్వంత్ ద్వితీయ స్థానం, 8వ తరగతి రుత్విక్, మోక్సిన్ మొదటి స్థానం, 9వ తరగతి ధనుష్క, సహస్ర మొదటి స్థానం పొందారని వివరించారు. మా విద్యాసంస్థలో విద్యతో పాటు వివిధ కళలను, కరాటే తదితర ఆత్మరక్షణ విద్యలను నేర్పుచున్నామని, మా విద్యార్థుల అభిమతానికి తగ్గట్టుగా మా ఉపాధ్యాయులు కృషి అనితర సాధ్యంగా ఉన్నదని తెలిపారు.




