రైతులందరూ విశిష్ట సంఖ్యను నమోదు చేయించుకోవాలని దర్శి వ్యవసాయ సహాయ సంచాలకులు కే బాలాజీ నాయక్ అన్నారు. మండలంలోని పసుపు గళ్ళు గ్రామంలో సోమవారం రైతు సేవా కేంద్రం వద్ద రైతుల విశిష్ట సంఖ్యను నమోదు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు విశిష్ట సంఖ్య గుర్తింపు నమోదు ఉంటేనే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయన్నారు. భూములు ఉన్న రైతులందరూ రైతు సేవ కేంద్రం నకు వెళ్లి విశిష్ట సంఖ్య నమోదు చేయించుకోవాలన్నారు. వ్యవసాయ అధికారి మహమ్మద్ ఫరూక్ మాట్లాడుతూ రైతులు విశిష్ట సంఖ్య నమోదు కొరకు ఆధార్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు లింక్ అయినా మొబైల్ నెంబరు తీసుకొని గ్రామ వ్యవసాయ సహాయకులను కలిసి నమోదు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ వేమూరి శ్రీ కీర్తి, ఏ స్వాతి, నరేంద్ర, రైతులు పాల్గొన్నారు.
