బీసీ కార్పొరేషన్ రుణాల కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సంబంధించిన దరఖాస్తులను సోమవారం నుండి బుధవారం వరకు పరిశీలించనున్నట్లు ఎంపీడీవో ఆర్ జనార్ధన్ తెలిపారు. సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సింగనపాలెం, ముండ్లమూరు, పోలవరం, నాయుడుపాలెం, శంకరాపురం, ఉమామహేశ్వరపురం గ్రామాలకు సంబంధించిన అభ్యర్థుల వివరాలను పరిశీలించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ ఎం రంగా నాయక్, మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ ఆంధ్రియ గుంటి, మండల పరిషత్ జూనియర్ అసిస్టెంట్ కే ప్రసూన రోజ్ మేరీ, కంప్యూటర్ ఆపరేటర్ పి మనోహర్, తదితరులు పాల్గొన్నారు.
