ఉద్యోగ బాధ్యతలలో నిబద్ధత తో పనిచేస్తే ప్రజా మన్ననలుపొందుతారని వైద్యాధికారులు ఎం జాస్మిన్, జె వెంకటేశ్వర రెడ్డిలు అన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం పదోన్నతి పొంది బదిలీపై బాపట్ల జిల్లా అద్దంకి మండలం మోదేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర లో పబ్లిక్ హెల్త్ నర్స్ గా వెళుతున్న వి కన్యా కుమారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాదికారులు మాట్లాడుతూ కన్యాకుమారి విధినిర్వహణలో నిబద్ధతగా పనిచేసే మంచి గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. రోగులకు మెరుగైన సేవలు అందించడంలో ఆమె సేవలు మరువలేనివి అన్నారు. ఉద్యోగ బాధ్యతల లో తోటి సిబ్బందితో కలిసి పనిచేసే ఆరోగ్య కేంద్ర అభివృద్ధికి పాటుపడడం అభినందనీయమన్నారు. అనంతరం పూలమాలలతో దృశ్యాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సి హెచ్ ఓ నారాయణరావు పుల్లం శెట్టి, హెచ్ ఈ ఏ శారద, సూపర్వైజర్ పి సుబ్బారావు, లెప్రసీ ఆఫీసర్ సుబ్బారెడ్డి , స్టాఫ్ నర్స్ కే మాధవి, జి రత్నకుమారి, ఫార్మసిస్ట్ కే యుగంధర్, సీనియర్ అసిస్టెంట్ వై ప్రభుదాసు, ల్యాబ్ టెక్నీషియన్ నాగార్జున, మేల్ స్టాఫ్ నర్స్ పి సురేంద్ర సాగర్, ఎఫ్ ఎన్ ఓ సిహెచ్ దిలీప్, వి స్మైలీ, తదితరులు పాల్గొన్నారు.


