ఒంగోలు/ మద్దిపాడు
రాము కులాసానా!! మీ రా టీం ఎలా ఉంది? అని భారతీయ జనతా పార్టి ప్రకాశం జిల్లా కన్వీనర్ ధనిశెట్టి రామునాయుడు ని రాష్ట్ర ఆరోగ్యశాఖామంత్రి వై సత్యకుమార్ యాదవ్ ప్రశ్నించారు. మంగళవారం మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు లో ఏర్పాటుచేసిన రచ్చబండ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న సత్య కుమార్ యాదవ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన దనిశెట్టి రాముని ఆప్యాయంగా పలకరించారు. కార్యక్రమం అనంతరం స్థానిక ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ మరియు సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ల కు రాముని పరిచయం చేస్తూ… మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నా ధర్మవరం నియోజకవర్గంలో వీరి రా టీం మొత్తం పదిమందికి పైగా విచ్చేసి ధర్మవరంలో ప్రచారం చేయడతో నా విజయానికి కృషి చేశారని తెలిపారు.
వారి ప్రశ్నలకు సమాధానంగా ధనిశెట్టి రామునాయుడు మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉన్నామని, మీ విజయానికి గుర్తు గా సంబరాలు చేసుకోవడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా ఈ తొమ్మిది నెలల కాలంలో ఆరోగ్య శాఖలో ఎన్నో ప్రక్షాళనలు చేసి ముఖ్యంగా క్యాన్సర్ కి సంబంధించిన విభాగం ప్రతి జిల్లా వైద్యశాలలో ఉండాలని మీరు తీసుకున్న నిర్ణయం ఎంతోమంది క్యాన్సర్ బాధితులకు ఉపయోగంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా దామచర్ల రాముపై చేయి వేసి అభినందనలు తెలిపారు.


