అంగన్ వాడీ ఉపాధ్యాయులు చిన్నారులకు చిన నాటి నుండి పరిసరాలపై, సమాజంపై మరింత అవగాహన పెంచేందుకే జ్ఞాన జ్యోతి కార్యక్రమం చక్కగా ఉపయోగపడుతుందని జిల్లా విద్యాశాఖాధికారి ఎ కిరణ్ కుమార్ అన్నారు. తాళ్లూరు వికే ఉన్నత పాఠశాలలో జరుగుతున్న జ్ఞాన జ్యోతి కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖాధికారి అకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… అంగన్ వాడీ టీచర్లకు వృత్యంతర శిక్షణ చాలా చక్కగా ఉపయోగపడుతుందని శిక్షణలో నేర్చుకున్న విషయాలను చిన్నారుల మానసికంగా, మేధో వృద్ధి, భాషా వృద్ధి, సామాజిక, భావోద్వేగ, సాంస్కృతిక, సాందర్య, సృజనాత్మకత . కారీరికంగా ధృఢంగా అభివృద్ధి చెందేలా ఉపయోగించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న వృత్తిలో కలిగి ఉన్న జ్ఞానాన్ని మరింత పెంపొందించుకునేందుకే ప్రభుత్వం ఐసీడీఎస్, విద్యాశాఖ సంయుక్తంగా సపోర్టివ్ ఆంధ్ర లెర్నింగ్ ట్రాన్స్ఫార్మింగ్ ( ఎస్.ఏ ఎల్ టి) సహకారంతో ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తున్నట్లు మండల విద్యాశాఖాధికారి జి సుబ్బయ్య, ఎంఈఓ -2 సుధాకర రావులు తెలిపారు. ప్రత్యేక ట్రైనర్. వికే ఉన్నత పాఠశాల హెచ్ఎం శేష గిరి మాట్లాడుతూ … అంగన్ వాడీ టీచర్లు గతంలో ఈసీఈ కు సంబంధించిన నాలెల్డ్ను మాత్రమే కలిగి ఉంటారని … శిక్షణలో పీపీఈ- 1, 2 లతో పాటు ఒకటి రెండు తరగతులను కూడ డీల్ చేసే విధంగా తర్పీదు ఇస్తామని చెప్పారు. శిక్షణ విద్యార్థులకు మరింత సులభంగా అర్థం అయ్యే విధంగా చెప్పెందుకు వీలుంటుందని అన్నారు. అంగన్ వాడీ సూజర్ వైజర్ జ్యోతి, సీఆర్పీలు శ్రీ మన్నారాయణ, చంద్రిక, శివ రామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పలు పాఠశాలల పరిశీలన ..
అనంతరం వికే ఉన్నత పాఠశాలను, కస్తూరి భా పాఠశాల ను సందర్శించారు. విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. చక్కగా చదివి ఉత్తమ మార్కులు సాధించాలని సూచించారు. పాఠశాలలో ఆట స్థలం ఉన్నది కనుక చక్కగా ఉపయోగించుకోవాలని కోరారు. పీఈటీ కి పలు సూచనలు చేసారు. హెచ్ఎం శేష గిరి తదితరులు ఉన్నారు.

