తాళ్లూరు మండలంలో ఉపాధి పనులు వేగవంతం చెయ్యాలని ఎంపీడీఓ దార హనుమంత రావు కోరారు. ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం మహాత్మాగాంధీ ఉపాధి హామీ పధకం సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఎపీఓ బి మురళీ మాట్లాడుతూ మండలంలో 16 పంచాయితీలకు గాను 12 పంచాయితీలలో ఉపాధి పనులు జరుగుతున్నాయని అందులో 900 మంది కూలీలు పనులలో పాల్గొంటున్నట్లు చెప్పారు. ఎంపీడీఓ హనుమంత రావు మాట్లాడుతూ ఆయా పంచాయితీలలో శ్రమ శక్తి సంఘాలు ఏర్పాటు చెయ్యాలని కోరారు. పనులు చేసిన గోకుల షేడ్స్కు పేమెంట్స్ త్వరగా చేయించాలని కోరారు. ఈసీ గురు బాబు, సిబ్బంది పాల్గొన్నారు.
