రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించే
నాధుడే కరువయ్యారని కాంగ్రెస్ పార్టీ అసంఘటిత కార్మికుల ఉద్యోగుల రాష్ట్ర చైర్మన్ దర్శి నియోజక వర్గ ఇన్చార్జి కైపు వెంకట క్రిష్ణా రెడ్డి కోరారు. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులను, పారిశుధ్య కార్మికులను పట్టించుకునే నాధుడే లేరని, వెలుగు గొండ విషయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందగా, నిరుధ్యోగ భృతి ఏమైనదని . రూ. 20 లక్షల ఉద్యోగాల సంగతి మరిచారా అని, మహిళలకు ఉచిత బస్సు ఎప్పుడు నుంచి అమలు పరుస్తారని దుయ్య బట్టారు. మన రాష్ట్రం గురించి పట్టించుకోని బిజేపి కి ఎందుకు జే జేలు పలుకుతున్నారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌ను దేవదాయ శాఖ, సినిమా ఆటోగ్రఫీ శాఖకు మార్పు చేయ్యాలని అదే విధంగా లోకేష్ శాఖలు కూడ మార్చాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.
