గొర్రెలను మేపుకుంటూ జీవనం సాగి
స్తున్న ఎరుకుల కులస్తులను కులం పేరుతో దూషించి దాడి చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేయకుండా నీరు కార్చేందుకు యత్నిస్తున్న తాళ్లూరు ఎస్సైపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రఎరుకల హక్కులపోరాట సమితీఅధ్యక్షులు ఎన్. మోహన్ కుమార్ ధర్మా ఎరుకల డిమాండ్ చేశారు. బొద్దికూరపాడులో కులంపేరుతో దూషించబడి, గాయపడిన ఎస్టీ కులస్తులకు అండగా నిలిచేందుకు తాళ్లూరు వచ్చిన సందర్భంగా గురువారం స్థానిక విలే కరులోమాట్లాడారు. బాపట్ల మండలం పావులూరు గ్రామానికి చెందిన ఎరుకల కుటుంబం పొట్ట చేతపట్టుకుని గొర్రెలను మేపుకుంటూ 2నెలల క్రితం బొద్దికూరపాడు గ్రామం చేరి జీవనం సాగిస్తున్నారన్నారు. రెండు రోజుల క్రితం గ్రామానికి చెందిన పోలంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, అంజిరెడ్డి మరికొం దరు ఆ కుటుంబం పై దాడి చేసి గాయపరిచారన్నారు. ఆడపిల్లలను తగల రాని చోట్ల కొట్టి గాయపరిచారన్నారు. న్యాయం చేయాలని స్థానికపోలీసులను ఆశ్రయిస్తే ఎస్సైఅధికార పార్టీ అగ్రవర్ణకులస్తులకు అండగా నిలిచి తక్షణమే ఆగ్రామంనుండి మీ జిల్లాకు వెళ్లిపోవాలని ఎస్సై ఎరుకలను బెరించారన్నారు. కనీసం ఫిర్యాధు కూడా తీసుకోకుండావెనక్కిపంపిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎరుకలపై దాడిచేసిన వారిపై ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేయాలని,ఎరుకల వారి జిల్లాకు వెళ్లపోవాలని ఎస్సై ఎరుకలను బెదిరించారన్నారు . కనీసం ఫర్యాధు కూడా తీసుకోకుండా వెనక్కిపంపిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎరుకలపై దాడిచేసిన వారిపై ఎస్సీఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేయాలని, ఎరుకల పట్ల పోలీసుల నిర్లక్ష్యవైఖరివిడనాడాలని, అగ్రవర్ణకులస్తులకు అండగానిలుస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని, కేసునమోదు చేయక నీరు కార్చేందుకు యత్ని స్తున్న తాళ్లూరు ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈకార్యక్రమంలో రాష్ట్ర ఎరుకల హక్కుల పోరాట సమితీ ఉపాధ్యక్షులు పేరంశ్రీనివాసరావు, సోషల్ వర్కర్, ప్రజాకవి పిన్నిక శ్రీనివాసరావు, ఎమ్మార్పిఎస్ రాష్ట్ర నాయకులు అనుపర్తి ఆదామ్ మాదిగ్, బాపట్ల జిల్లా వైహెచ్పిఎస్ నాయకులు బ్రహ్మయ్య, అనీల్, కిరణ, తదితరులు పాల్గొన్నారు.

