తాళ్లూరు మండలం బొద్దికూరపాడులో గురువారం ఇరు వర్గాలు గొడవడి పరస్పరం కేసులు నమోదు చేసుకున్నారు. బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పావులూరుకు చెందిన సి.వీరయ్య కుటుంబీకులతో బీకేపాడులో గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గొర్రెలు చేనులో పడ్డాయని గ్రామానికి చెందిన పోలంరెడ్డి వెంకటేశ్వర్లు అనుచరులతో దాడి చేసి కొట్టాడని వీరయ్య కుటుంబీకుల ఫిర్యాదుతో ఎస్సై ఎస్.మల్లికార్జు నరావు కేసు నమోదు చేశారు. ప్రతిగా వీరయ్య కుటుంబీకులే తమ కుటుం బీకులపై దాడి చేశారని పి.రాజేశ్వరి ఫిర్యాదుతో మరో కేసు నమోదయ్యింది. విషయం తెలిసి రాష్ట్ర ఎరుకల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు ఎన్. మోహన్ కుమార్ ధర్మ బాధిత కుటుంబీకులతో కలిసి నిరసన తెలిపారు. ఆయన వెంట నాయకులు పాల్గొన్నారు.
బొద్దికూరపాడులో గొర్రెలు మేపుకునే విషయంలో ఘర్షణ – పరస్పర కేసులు
21
Feb