చెత్త నుండి సంపదను సృష్టించాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకట నాయుడు అన్నారు. మండలంలోని కెల్లంపల్లి , పెద్దవుల్ల గళ్ళు గ్రామాల్లో గల డంపింగ్ యార్డులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్ లకు తరలించి అక్కడే చెత్త నుండి వర్మి కంపోస్ట్ ను తయారు చేసే విధానాన్ని వివరించారు. రికార్డుల గురించి సవివరంగా చర్చించడం జరిగింది. రాష్ట్ర కమిషన్ ఆదేశాల మేరకు శని, ఆదివారాలలో గ్రామాల్లో ఇంటింటికి తిరిగి గార్బేజి కలెక్షన్ కు హాజరై ప్రతి ఇంటిని సందర్శించాలని సూచించారు. ఈ విషయాల్లో ముండ్లమూరు మండలం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు తెలియజేశారు. అదేవిధంగా 2024 -2005 ఆర్థిక సంవత్సరం సంబంధించి ఇంటి పన్నులు మరియు పనేతర పన్నులు మార్చి 15వ లోపు 100% పన్నులు వసూలు చేయాలని సూచించారు. వారంలో ఒకరోజు పన్నుల వసూళ్లకు టార్గెట్ నిర్ణయించుకొని పన్నులు వసూలు చేయాలని. వసూలు చేసిన పన్నులను పంచాయతీల ఖాతాలకు జమ్ము చేయాల న్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఆర్ జనార్ధన్, పంచాయతీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.
