కేంద్ర ప్రభుత్వం ఈ నెల 24 వ తేదీ విడుదల చేయనున్న 19 విడత పిఎం కిసాన్ నిధుల విడుదలకు ప్రతి రైతు తప్ప నిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఎస్. శ్రీనివాసరావు తెలిపారు. తాళ్లూరు మండలంలోని తాళ్లూరు1, తాళ్లూరు 2, శివరాంపురం, విఠలాపురం రైతుసేవాకేంద్రాలందు జరుగుతున్న ఫార్మర్ రిజిస్ట్రేషన్ విధానాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ప్రస్తుతం పిఎం కిసాన్ కు అర్హులైన రైతులకు సత్వరమే ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలన్నారు. త్వరితగిన పిఎం కిసాన్ లబ్ది పొందుతున్న రైతులు రైతుసేవా కేంద్రాలకు వెళ్లి ఓటిపిల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 1,58,000 మంది రైతుల ఫార్మర్ రిజిస్ట్రే షన్ పూర్తి చేయటం జరిగిందన్నారు. తాళ్లూరు మండల వ్యవసాయాధికారి బి.ప్రసాద రావు మాట్లాడుతూ …. మండలంలోని అన్ని గ్రామాల రైతులు వ్యవసాయశాఖకు సహకరించి సంబందిత వ్యక్తుల ఆధార్ నెంబర్ , ఫోన్, భూమి వివరాలను తెలపాలన్నారు. విఆర్వోలు ఆవివరాలను పరిశీలించి తహసీల్దార్ లాగిన్ లోఅప్రూవ్ చేయాలని, అలా చేయటం వల్ల తప్పులు లేకుండా ఉంటాయన్నారు. ఈకర్యక్రమంలో
విఏఏలు ఎం.రాజశేఖర్ రెడ్డి నాగరాజునాయక్, వెంకట్రావు, అశోక్, రైతులు పాల్గొ న్నారు.



