గ్రామాల లోని విద్యుత్ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ అందించే విధంగా కృషి చేయాలని దర్శి డివిజన్ విద్యుత్ ఈ ఈ పి శ్రీనివాసులు అన్నారు. మండలంలోని మారెళ్ళ విద్యుత్ ఉపకేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ వేసవికాలం సమీపిస్తున్నందున అధిక లోడు పై జాగ్రత్తగా ఉండాలన్నారు. విద్యుత్ పెండింగ్ బకాయిలను వసూలు చేయాలన్నారు. మొండి బకాయిలు ఉన్న సర్వీసులను తొలగించాలన్నారు. విద్యుత్తు లైన్లో తీగ లు కిందకు వేలాడుతుంటే వాటిని సరి చేయాలన్నారు. విద్యుత్ సమస్యలుంటే ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో లైన్ మాన్ పివి ఆంజనేయులు, జేఎల్ఎం మల్లికార్జున, షిఫ్టింగ్ ఆపరేటర్ ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

