గంజాయి విక్రయిస్తున్న నిందితులు అరెస్ట్

గంజాయి అమ్ముతున్న నలుగురు నిందితులను అరెస్టు చేసి దర్శి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు దర్శి డిఎస్పి లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ముండ్లమూరు పోలీస్స్టేషన్ లో
శనివారం విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025 ఫిబ్రవరి 21 న శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో మండలంలోని వేంపాడు గ్రామం వద్ద ఆంజనేయ స్వామి గుడి వద్ద గంజాయి అమ్ముతున్న ముద్దాయిలైన ఈదర గ్రామానికి చెందిన జడ లక్ష్మీనారాయణ( ఈదర) బాపట్ల జిల్లా, మార్టూరు మండలం, నాగరాజు పల్లి గ్రామానికి చెందిన జడ శ్రీహరి, బాపట్ల జిల్లా, మార్టూరు మండలం’ నాగరాజు పల్లి గ్రామానికి చెందిన మొగిలి వంశీ, బాపట్ల జిల్లా, మార్టూరు మండలం, ఉప్పు శివ, గోపాల్ నా రాజు పల్లి రోడ్డు సెంటర్ సంపత్ నగర్ మార్టూరు, నలుగురు నిందితులను అరెస్టు చేశారు.
లక్ష్మీనారాయణపై గతంలో మార్టూరు, చీరాల వన్ టౌన్, నరసరావుపేటటూ టౌన్ పోలీస్ స్టేషన్లో గంజాయి కేసు లు నమోదు అయ్యాయని, అదేవిధంగా నిందితులైన ఉప్పు శివ, గోపి మీద కూడా వేటపాలెం పోలీస్ స్టేషన్లో నందు గంజాయి కేసు నమోదు అయి ఉన్నాయని, నిందితుడు శ్రీహరి పై కూడా గతంలో మార్టూరు పోలీస్ స్టేషన్లో మూడు వివిధ కేసుల్లో నమోదు కాబడి ఉన్నవి, తాజాగా ముద్దాయిలందరూ కలిసి గత కొంతకాలంగా సామర్ల కోటకు చెందిన ఓ వ్యక్తి దగ్గర నుండి గంజాయి కొనుగోలు చేసి బాపట్ల జిల్లాలోని మార్టూరు, ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల వారికి తెలిసిన వ్యక్తుల ద్వారా గంజాయి అమ్మటం చేస్తున్నారని, దర్శి సీఐ వై రామారావు, ముండ్లమూరు ఎస్ఐ నాగరాజులకు సమాచారం రావడంతో వారి కదలికలపై నిఘావంచగా21 న మార్టూరు నుండి నలుగురు ముద్దాయిలు మండలంలోని ఈదర గ్రామానికి వచ్చి వచ్చి అక్కడనుండి ఒంగోలు కి వెళుతున్న సమయంలో మండలంలోని వేంపాడు గ్రామం జంక్షన్ వద్ద ముళ్ళమూరు ఎస్సై వారి సిబ్బంది నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి నాలుగు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారని, తదుపరి దర్శి సి ఐ వై రామారావు కేసు దర్యాప్తు చేపట్టి ఎస్ డి పి ఎస్ యాక్ట్ కింద ముద్దాయిలను దర్శి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు పంపడం జరుగుతుందని, అంతేకాకుండా నిందితులందరూ కూడా ఒక ముటాగా ఏర్పడి ఆర్గనైజడుక్రైమ్ చేస్తున్నారని వారి మీద కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సహిత చట్టం( బి ఎస్ ఎన్ ) సెక్షన్111 కింద కూడా ముద్దాయిలపై కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న దర్శి సిఐ వై రామారావు, ముళ్ళమూరు ఎస్సై వై నాగరాజు, ముండ్లమూరు హెచ్ ఎస్ సి బి వెంకటేశ్వర్లు, ముండ్లమూరు పిసి మహేష్, హోంగార్డు కాసిం లను మరియు ముళ్ళమూరు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్, దర్శి డిఎస్పి బి లక్ష్మీనారాయణ అభినందించి రివార్డులు ప్రకటించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *