చిన్ననాటి జ్ఞపకాలను గుర్తు చేశాయి – ఇన్స్పెక్టర్ నర్సింగరావు -ఘనంగా వరల్డ్ థింకింగ్ డే (బెడెన్ పావెల్ జయంతి)

తన చిన్ననాటి జ్ఞపకాలను గుర్తు చేశాయని రాంగోపాల్పేట్ పోలీస్ ఇన్స్పెక్టర్ నర్సింగరావు
అన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకుల జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ధింకింగ్ డే ( ఆలోచనా దినోత్సవాన్ని ) జరుపుకుంటారు. అందులో భాగంగా శనివారం సికింద్రాబాద్ సర్దార్ పటేల్ రోడ్డులోని భారత్ స్కౌట్స్ ఆండ్ గైడ్స్ సికింద్రాబాద్ జిల్లా| కార్యలయంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయి బెడెన్ పౌవెల్, లేడి బెడెన్ పొవెల్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణలో చిన్ననాటి నుండి క్రమశిక్షణను అలవరచడం ఏంతో అభినందనీయమని, చిన్ననాటి నుండి క్రమశిక్షణతో ఉంటే భవిష్యత్తులో పెద్దవారైన తరువాత మంచిగా ఉంటూ పోలీసులకు పని తక్కువ చేసిన వారవుతారని, ఇలాంటి వాటిలో తమ పిల్లలను చేర్చి వారిని మరింత మంచి పౌరులుగా మారే విదంగా తల్లిదండ్రులు చూడాలని ఆకాంక్షించారు. అంతకు ముందు జిల్లా అధ్యక్షులు మాధవరావు మాట్లాడుతూ… స్కౌట్ వ్యవస్థాపకులు చూపిన మార్గంలో, స్కౌట్ మాస్టర్లు, గైడ్ క్యాప్టెన్లు, తల్లిదండ్రుల దిశా నిర్దేశంలో పయనించి స్కౌట్స్, గైడ్స్ భవిష్యత్తులో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరంస్కౌట్స్ గైడ్స్ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఉదయం నుంచి విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాల పోటీలలో విజేతలకు, ఇటీవల తమిళనాడు తిరిచిరాపల్లిలో నిర్వహించిన డైమండ్ జూబ్లి జాంబోరీలో జిల్లా నుంచి పాల్గొని తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించిన స్కౌట్స్, గైడ్స్, రోవర్స్, రేంజర్లను అభినందిస్తూ ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమలో ఏఎసై సాంబ నాయక్, డాక్టర్ గీతా, దక్షిణ మధ్య రైల్వే పీఆర్ఓ రాజేష్, జిల్లా ఛీఫ్ కమీషనర్ కేవి దేవ్ ధత్, జిల్లా కార్యదర్శి రమేష్ చందర్, కోశాధికారి రాజశేఖర్ రేడ్డి ఉపాధ్యక్షులు మనోజ్కుమార్, ట్రైనింగ్ కమీషనర్ విజయభాస్కర్, ఆర్గనైజింగ్ కమీషనర్లు గౌరీనాధ్ సంగీతా పాం డే. కమీషనర్లు డాక్టర్ ఎంహెచ్ భతేనా. రాజేశ్వరి, విష్ణు ప్రసాద్. పలువురు స్కౌట్ మాస్టర్లు, గైడ్ క్యాప్టెన్లు, స్కౌట్స్, గైడ్స్, రోవర్స్, రేంజర్స్ పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *