పట్టబద్రులంతా మొదటి ప్రాధాన్యత ఓటు 1 పై వేసి ఆలపాటి రాజా ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి…… టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ – వైసీపీ ఐదేళ్ళ పాలనలో వ్యవస్థలను నిర్వీర్యం చేసినందుకే ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు – ప్రజలను మభ్యపెట్టే మాటలు మాట్లాడటం ఇకనుంచైనా మానుకోవాలి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలి
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గుంటూరు అర్బన్ ప్రయివేట్ స్కూల్ అసోసియేషన్ ఉపాధ్యాయులతో శనివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న టూరిజం డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ
మాట్లాడుతూ ….. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన పరిపాలనకు మరింత మద్దతు ఇవ్వడానికి వీలుగా పట్టభద్రులు అందరూ గుంటూరు – కృష్ణా ఉమ్మడి జిల్లాల టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

నిరుద్యోగ యువత సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్యంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించాలని, అని కూటమి నేతలు, కార్యకర్తలకు సూచించారు. పట్టభద్రుల సమస్యలపట్ల పూర్తి అవగాహన ఉన్న ఆలపాటిని గెలిపించుకుందామన్నారు. ఆలపాటిని గెలిపించే బాధ్యత అందరూ తీసుకోవాలని కోరారు. వైసీపీ గత ఐదేళ్ళ పాలనలో వ్యవస్థలను నిర్వీర్యం చేసినందుకే ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టే మాటలు మాట్లాడటం ఇకనుంచైనా మానుకోవాలని హితవు పలికారు. నేతలు క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకుని ఓటర్లను చైతన్యపరచాలని సూచించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కూటమికి 93 శాతం స్ట్రయిక్ రేట్ తో విజయం అందించారని ప్రజల నమ్మకం నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిత్యం పనిచేస్తున్నారని అన్నారు. వ్యవస్థలను చక్కదిద్ది, పాలనలో స్పష్టమైన మార్పు సీఎం చంద్రబాబు తీసుకొచ్చారన్నారు.
రాష్ట్ర సమగ్రాభివృద్ధి తో పాటు విద్యారంగం బలోపేతానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు కృషి ప్రశంసనీయమన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉపాధి కల్పనే లక్ష్యంగా అనేక సంస్థలు ఏర్పాటు చేస్తున్నారని, రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రణాళిక బద్దంగా ముందుకు సాగుతున్నారని అన్నారు. ఇప్పటికే 4 లక్షల మంది నిరుద్యోగ యువత ఉపాధి కల్పనకు ప్రభుత్వ పరంగా చేపట్టిన సంస్కరణలో మంచి ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. పలు సంస్థలతో ఒప్పందలు పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికలకు కోడ్ అనంతరం రాష్ట్రంలో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఉమ్మడి కృష్ణ – గుంటూరు జిల్లాల పరిధిలో జరుగుతున్న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో సీనియర్ నాయకులు, మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కి పట్టబద్రులంతా మొదటి ప్రాధాన్యత ఓటు 1 పై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రం బాగుండాలంటే సీఎం చంద్రబాబు నాయికత్వాన్ని బలపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో, మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ, గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వర్లు, గుంటూరు తూర్పు నియోజకవర్గం అబ్జర్వర్ రాఘవేంద్ర, బిజెపి నాయకులు ఉమాశంకర్, డిప్యూటీ మేయర్ సాజిల, కార్పొరేటర్ సరిత, చిట్టిబాబు, ఎల్లవుల అశోక్, రైల్వే బోర్డు నెంబర్ అంగిరేకుల వరప్రసాద్ యాదవ్, ప్రైవేట్ స్కూల్స్ కరస్పాండెంట్స్, మరియు గుంటూరు పట్టణ నాయకులు, ప్రవేట్ టీచర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *