ఉచిత వైద్య శిభిరాలతో పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం రాంగోపాల్ పేట డివిజన్ లోని కుర్మబస్తీ లో మక్తాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య ఆరోగ్య పరీక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ శిబిరంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ బిపి పరీక్ష చేయించుకోగా నార్మల్ ఉందని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు అధికంగా నివసించే బస్తీలలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి సంవత్సరం ప్రింటర్స్ డే సందర్భంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్న నిర్వహకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, అత్తిలి అరుణ గౌడ్, బి ఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు కిషోర్ కుమార్, ఆంజనేయులు, నాగులు, పబ్బా ప్రకాష్, చంద్ర ప్రకాష్, మక్తాల ఫౌండేషన్ నిర్వహకులు జలందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


