9545 మంది లబ్ధిదారులకు 1కోటి 91 లక్షలు

ముండ్లమూరు మండలంలోని 21 గ్రామపంచాయతీలలో9545 మంది లబ్ధిదారులకు1 కోటి91 లక్షల రూపాయలు వారి ఖాతాలకు జమ చేయడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి మహమ్మద్ ఫరూక్ తెలిపారు. స్థానిక రైతు భరోసా కేంద్రంలో సోమవారం సిబ్బందితో సమావేశం నిర్వహించి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ సమరహోకార్యక్రమాన్ని భోగాపురంలో బీహార్ నుంచి ప్రత్యేక ప్రసారం టీవీల ద్వారా రైతులు సిబ్బంది వీక్షించారు. వ్యవసాయ అధికారి మాట్లాడుతూ పీఎం కిసాన్ సమ్మన్ నిధికి సంబంధించిన 19వ విడత నిధుల విడుదల చేయడం జరిగిందని తెలియజేశారు. ముండ్లమూరు మండలానికి సంబంధించి9545మంది లబ్ధిదారులకు1 కోటి 91 లక్షల రూపాయలు వారి ఖాతాలకు నేరుగా జమ చేయడం జరిగినది తెలియజేశారు. పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 6000 రూపాయలు భూ యజమానులకు మూడు విడతలుగా, ఒకటో విడత జూన్, జూలై మాసాల్లో, రెండో విడత అక్టోబర్ మాసంలో, మూడో విడత జనవరి, ఫిబ్రవరి మాసాల్లో జమ చేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఈఓ వేమూరి శ్రీ కీర్తి, ఆదిమూలం దివ్య, వీఏ ఏ శోభారాణి, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *