క్విస్ క‌ళాశాల మ‌రో ముంద‌డుగు… అంత‌ర్జాతీయ యూనివ‌ర్సీటీలో విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ – స‌ర్టిఫికెట్లు అంద‌జేసిన యాజ‌మాన్యం – అంత‌ర్జాతీయ స్థాయి విద్య అందించ‌డ‌మే ల‌క్ష్యం – యాజ‌మాన్యం – రానున్న రోజుల్లో మ‌రిన్ని యూనివ‌ర్సీటీల‌తో ఒప్పందాలు

త‌మ క‌ళాశాలలో చ‌దివే విద్యార్థుల‌కు అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాల‌తో విద్య‌ను అందించ‌డ‌మే లక్ష్యంగా ముందుకు సాగుతోంది క్విస్ క‌ళాశాల యాజ‌మాన్యం. అంత‌ర్జాతీయ యూనివ‌ర్సీటీల‌తో క‌లిసి విద్యార్థుల‌కు ఇంట‌ర్న్ షిప్ చేసే అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. దాంట్లో భాగంగానే సీఎస్ ఈ, అనుబంధ బ్రాంచ్ ల‌కి చెందిన 30 మంది విద్యార్థులు యూకే లోని టాప్ యూనివ‌ర్సీటీ అయినా కార్డిఫ్ మెట్రోపాలిట‌న్ యూనివ‌ర్సిటీ లో ఇంట‌ర్న్ షిప్ పూర్తి చేసుకున్నారు. దాదాపు నెల రోజుల పాటు ఆన్ లైన్ ద్వారా క్విస్ విద్యాసంస్థ‌లు, కార్డిఫ్ యూనివ‌ర్సీటీ సంయుక్తంగా ఈ ఇంట‌ర్న్ షిప్ ని పిల్ల‌ల‌కి అందించారు.ప్రొఫెస‌ర్ రాజ్ రామ‌చంద్ర‌న్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో విద్యార్థులు ఇంట‌ర్న్ షిప్ ని పూర్తి చేసుకున్న‌ట్లు సీఎస్ ఈ హెచ్ వోడీ డాక్ట‌ర్ బుజ్జిబాబు తెలియ‌జేశారు. కోర్సు పూర్తి చేసిన విద్యార్థుల‌ను క్విస్ విద్యాసంస్థల అధినేత డాక్ట‌ర్ నిడ‌మానూరి సూర్య క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి గారు అభినందించారు. ఈ సంద‌ర్భంగా క్విస్ కాలేజిలోని రామానుజ‌న్ సెమినార్ హాల్ లో అభినంద‌న కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసి విద్యార్థుల‌కు ప్రశంసా ప‌త్రాల‌ను అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మానికి విద్యాసంస్థ‌ల ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మ‌న్ డాక్ట‌ర్ శ్రీ గాయ‌త్రి గారు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. విద్యార్థుల‌కు ప్ర‌సంశా ప‌త్రాల‌ను అందజేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ… క్విస్ క‌ళాశాల‌లో చ‌దివే ప్ర‌తి విద్యార్థికి అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాల‌తో విద్య‌ను అందించ‌డ‌మే లక్ష్యంగా ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌ని దాంట్లో భాగ‌మే ఈ ఇంట‌ర్న్ షిప్ ప్రోగ్రామ్ అని అన్నారు. ముందు ముందు మ‌రిన్ని యూనివ‌ర్సీటీల‌తో ఒప్పందాలు చేసుకుని ఫారెన్ ఎక్స్ ఛేంజ్ ప్రోగ్రామ్ ల‌ను కూడా ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దాంట్లో భాగంగా విద్యార్థులు ఇత‌ర దేశాల‌కు వెళ్లి అక్క‌డ ప్రాజెక్టులు చేసే అవ‌కాశం క్విస్ క‌ల్పిస్తుంద‌ని అన్నారు. ఇలాంటి కార్య‌క్ర‌మాలు ముందుముందు చాలానే జ‌రుగుతాయ‌ని, క్విస్ క‌ళాశాలలో చ‌దివే విద్యార్థులు, చ‌ద‌వ‌బోయే విద్యార్థులకు అద్భుత‌మైన అవ‌కాశాలు ల‌భించ‌నున్నాయ‌ని ఆమె అన్నారు. ఇంట‌ర్న్ షిప్ పూర్తి చేసుకున్న విద్యార్థుల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిన గాయ‌త్రి గారు.. ఈ సంద‌ర్భంగా సీఎస్ ఈ హెచ్ వోడీ బుజ్జిబాబు, ఫ్యాకల్టీని అభినందించారు. ఈ సంద‌ర్భంగా క్విస్ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల ప్ర‌న్సిప‌ల్ డాక్ట‌ర్ వై.వి. హ‌నుమంత‌రావు మాట్లాడుతూ ఇంట‌ర్న్ షిప్ ప్రాముఖ్య‌త‌ను పిల్ల‌ల‌కు తెలియ‌జేశారు. ఇంట‌ర్న్ షిప్ అనేది ప్ర‌తి ఇంజ‌నీరింగ్ విద్యార్థికి చాలా అవ‌స‌రం అని అన్నారు. ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండ‌ర్స్ లో కోర్సు పూర్తి చేయ‌డం భ‌విష్య‌త్తుకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని, రానున్న రోజుల్లో ఇలాంటివి మ‌రిన్ని జ‌ర‌గ‌నున్నాయ‌ని ప్ర‌తి ఒక్క విద్యార్థి వాటిని ఉప‌యోగించుకోవాల‌ని అన్నారు. ఇంట‌ర్నేష‌న‌ల్ యూనివ‌ర్సీటీ లెవెల్ స‌ర్టిఫికెట్ రావ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులు అన్నారు. ఈ కోర్సు త‌మ‌కు చాలా బాగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని, ఇలాంటి అవ‌కాశాలు ఇస్తున్న యాజ‌మ‌న్యానికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. ఈ కార్య‌క్ర‌మాన్ని డాక్ట‌ర్ బుజ్జిబాబు ప‌ర్య‌వేక్షించారు. క్విస్ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌కు చెందిన వివిధ విభాగాల డైరెక్ట‌ర్లు, డీన్ లు, హెచ్ వోడీలు, సిబ్బంది, విద్యార్థులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *