వ్యవసాయ, రెవిన్యూ సిబ్బంది సమన్వయంతో పనిచెయ్యాలి

వ్యవసాయ, రెవిన్యూ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేసి
రైతులకు పారదర్శక సేవలు అందించాలని తహసీల్దార్ ఇమ్మానియేల్ రాజు, వ్యవసాయాధికారి ప్రసాద రావులు కోరారు. తాళ్లూరులో తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం విఆర్ఓ లలకు, విఏఏల కు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్లో గాని, ఈ పంట నమోదు రికార్డులలో గాని విఏఏలు రికార్డు చేసిన వివరాలు సక్రమంగా ఉన్నాయా లేవా అన్ని విషయాలను పరిశీలించి తహసీల్దార్ అప్రూవల్ కు పంపాలని చెప్పారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు త్వరతిగతిన ఆ పనులను పూర్తి చెయ్యాలని కోరారు. డిటి ప్రశాంత్, విఆర్ ఓలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *