మార్చి 20న ఎ ఎన్ యు భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జరగబోతున్న రెండు రోజుల జాతీయ సదస్సును విద్యార్థినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని
ఎ ఎన్ యు.తాత్కాలిక ఉపకులపతి ఆచార్య కంచర్ల గంగాధర రావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన సదస్సు సమాచార కరపత్రాలను ఆవిష్కరించారు.ఆచార్య సీహెచ్ లింగరాజు ఈ సదస్సుకు కన్వీనర్ గా వ్యవహరించనున్నారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో తాత్కాలిక రిజిస్ట్రార్ ఆచార్య జి సింహాచలం, భౌతిక శాస్త్ర ఆచార్యులు సంధ్యా కోలే,ఆర్ వి ఎస్ ఎస్ రవి కుమార్, వి రవికుమార్, ఆచార్య జీ నాగరాజు, పాల్గొన్నారు.
