శివనామస్మరణలతో మారుమ్రోగిన ఆలయాలు

శివునికి పవిత్రదినమైన శివరాత్రి పం
డుగ సందర్భముగా బుధవారం మండలంలోని శివాలయాలు, ఆలయాలయందు భక్తుల శివనామస్మరణలతో మారుమ్రోగాయి. శివరాత్రి సందర్భముగా శివరాంపురం సమీపానగల అతిపురాతన ఆలయం అగస్తేశ్వరాలయం నందు ఈశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు,పూజలు నిర్వహించారు. గుంటిగంగ సన్నిధిలో ఇటీవలే పునఃప్రతిష్టిం చిన పురాతన మల్లేశ్వరస్వామి ఆలయం, లక్కవరంలో పురాతన కాలంలో నిర్మిం చిన చెన్నమల్లేశ్వరస్వామి ఆలయాలందు శివునికి ప్రత్యేక పూజలుజరిగాయి. పలు గ్రామాల్లో తాళ్లూరు నందురామలింగేశ్వరాలయం నందు వేకువ జామున పంచా మృత అభిషేకాలు జరిగాయి. లక్కవరం కాశీవిశ్వేశ్వరాలయం నందు కృష్ణస్వామి ఆద్వర్యంలో,బొద్దికూరపాడుగ్రామంలో శ్రీగంగా పర్వతీవర్థినీ సోమేశ్వరదేవాలయం, మాధవరంలోశివాలయం వద్దగంగాభవానీ ఆలయాలందు ప్రత్యేక పూజలుజరిగాయి. అన్ని ఆలయాలందుభక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అన్ని గ్రామాల్లోని శైవ ఆ లయాలందు భక్తులు అధికసంఖ్యలో పాల్గొని శివునికిప్రత్యేక పూజలు చేస్తుండగా శివనామస్మరణలతోఆలయాలు మారుమ్రోగాయి.ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. సాయంత్రంగ్రామోత్సవం,కళ్యాణం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో పూజారులు ప్రకాష్ పంతులు, వాసుదేవ శర్మ, ఎన్వి రమణయ్యలు – స్వాముల వారికిపూజలు నిర్వహిఆంచారు. శివరాత్రి జాగారం కోసం పుణ్యక్షేత్రా లకు,కోటప్ప కొండ తిరుణాళ్లకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *