శివోహం అంటూ మారుమోగిన శివాలయాలు.ప్రకాశం నగర్ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన ఏసిపి, సిఐలు……………….

ఓం నమశ్శివాయ, హర హర మహాదేవ ,శంభో శంకర, శివోహం అంటూ శివాలయాలు శివనామస్మరణతో మారుమోగిపోయాయి. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయాలను వివిధ రకాలైన విద్యుత్ దీపాలు రంగురంగులు పూలతో సుందరంగా ముస్తాబు చేశారు. ఉదయం నుంచి భక్తులు శివాలయాలకు పోటెత్తారు .బేగంపేట ప్రకాశం నగర్ లోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో బేగంపేట ఏసిపి గోపాలకృష్ణమూర్తి, ఇన్స్పెక్టర్ చిర్ర రామయ్యలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో శివలింగానికి అభిషేకం చేశారు. అనంతరం శ్రీ శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు .ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దివ్య దర్శనం, ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు అభిషేకాలు, గం 1.10 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పావని శిష్య బృందంతో కూచిపూడి నాట్య ప్రదర్శన రాత్రి 11 గంటల నుంచి ప్రత్యేక (లింగార్చన )మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు. భక్తులు సంప్రదాయమైన వస్త్రాలతో పూజలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఆలయ కార్యనిర్వాహణాధికారి యం. విఠలయ్య ,శ్రీ భూ లక్ష్మమ్మ ఆలయ నిర్మాణదాత విశాల్ సూదాంల ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. అర్చకులు మఠం సదాశివుడు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా బేగంపేట ఏసిపి గోపాలకృష్ణమూర్తి ఇన్స్పెక్టర్ రామయ్యలను విశాల్ సుధామ్ శాలువాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో శేఖర్ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్పి రోడ్డు శ్రీ వీర హనుమాన్ ఆలయంలోని శ్రీ ఉమా ముక్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారి అభిషేకంలో పాల్గొన్నారు. బేగంపేట్ శ్యామ్లాల్ బిల్డింగ్ శ్రీ హనుమాన్ దేవస్థానంలో కూడా మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారికి అభిషేకాలను నిర్వహించారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయంలో శివ పార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *