మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ప్రకాశం జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. త్రిపురాంతకంలోని శ్రీ త్రిపురాంతకేశ్వరస్వామి దేవస్థానము, శ్రీమత్ బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవస్థానములలో 26న మహాశివరాత్రి మహోత్సవములు మరియు 28న రథోత్సవం సందర్బంగా జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్
బుధవారం అక్కడి భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించినారు. ఆలయ పరిసరాలు, ప్రవేశ మార్గములు, క్యూలైన్లను భద్రతా మరియు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. దేవాలయం, రథం వద్ద భద్రత ఏర్పాట్లను సమీక్షించారు.
జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్
ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. దర్శనానికి విచ్చేసిన భక్తులతో మాట్లాడి అక్కడ ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసరాలను సందర్శించి, దర్శనానికి వచ్చే భక్తులకు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని తెలిపారు. దర్శనం నిమిత్తం వచ్చే భక్తులకు కొరకు క్యూ లైన్లు పక్కగా నిర్వహించాలని, ఆలయం లోపల భక్తుల ప్రవేశం, మరల తిరిగి వెళ్లే మార్గాల వద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. దర్శనానికి వచ్చే భక్తుల వాహనాలు నిలిపే పార్కింగ్ ప్రాంతాలలో వాహనాలు క్రమ పద్ధతిలో నిలిపేయాల చూడాలని , ట్రాఫిక్ అంతరాయం లేకుండా క్రమబద్ధీకరించాలని ప్రయాణికులకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ పటిష్టంగా బందోబస్తు నిర్వహించి ప్రశాంత వాతావరణంలో శివరాత్రి ఉత్సవాలను నిర్వహించాలని తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ ఏ ఆర్ దామోదర్
మాట్లాడుతూ…. త్రిపురాంతకంలో శివరాత్రి ఉత్సవాలు మరియు రథోత్సవాలు జరుగుతున్నాయని, పండుగ ఉత్సవాలు, ఊరేగింపులు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ సిబ్బందితో పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నామని, పూర్తి స్ధాయి బందోబస్తుతో అప్రమత్తంగా ఉంటూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. శుక్రవారం రథోత్సవం సందర్భంగా రూట్ చెక్ చేసి సిబ్బందికి కీలక సూచనలు ఇవ్వటం జరిగిందని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు అధికారులతో క్రమపద్ధతిన సమీక్ష నిర్వహించామని, ఉత్సవం జరిగే ప్రాంతంలో అసాంఘిక చర్యలకు అవకాశం లేకుండా పర్యవేక్షణ చేస్తున్నామని, దర్శనం మరియు రథోత్సవం సమయంలో భక్తులు, తోపులాటలు లేకుండా పండగ వాతావరణంలో వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. దేవాలయం వద్ద మరియు రథోత్సవం జరిగే ప్రాంతంలో సిసి కెమెరాల,డ్రోన్ కెమెరా నిఘా ఏర్పాటు చేసేమన్నారు.
జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ వెంట దర్శి డిఎస్పీ లక్ష్మి నారాయణ,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, త్రిపురాంతకం సిఐ అసన్, డిసిఆర్బీ దేవప్రభాకర్, త్రిపురాంతకం ఎస్సై శివబసవరాజు మరియు సిబ్బంది ఉన్నారు.










