ప్రకాశం జిల్లా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, తాజా మాజి అధ్యక్షులు పి శివారెడ్డి, సుశీల దంపతుల కుమారుడు డాక్టర్ మణికంఠ సాయి కృష్ణారెడ్డి వివాహము విశాఖపట్నం కి చెందిన కొయ్య రామకృష్ణారెడ్డి సుగుణ దంపతుల కుమార్తె డాక్టర్ శేష సాయి రక్షిత తో ఆదివారం ఉదయం విశాఖపట్నంలోని పీఎం పాలెం, క్రికెట్ స్టేడియం పక్కనగల వైజాగ్ కన్వెన్షన్ హాల్లో అత్యంత సుందరమైన వేదికపై, పురోహితుల వేదమంత్రాల సాక్షిగా, విచ్చేసిన బంధుమిత్రుల ఆశీస్సులతో ఘనంగా జరిగినది.
వివాహ వేడుకకు కేంద్ర మంత్రి పెద్ద సంఖ్యలో భారతీయ జనతా పార్టీ నాయకులు వివిధ పార్టీ నాయకులు తరలివచ్చారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి శ్రీనివాస వర్మ, రాష్ట్ర ఆరోగాయశాఖా మంత్రి వై సత్యకుమార్ యాదవ్, సోమ వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ, జీవీఎల్ నరసింహారావు, లంకా దినకర్, పరశురామరాజు, రవీంద్రారెడ్డి, సూర్య నారాయణరాజు, నిర్మలా కిషోర్, లక్ష్మీ ప్రసన్న, యామిని శర్మ, సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, నాగేంద్ర, పిల్లి కృష్ణారెడ్డి, రవిశంకర్, ప్రకాశం జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు, శివాజీ యాదవ్, పండు శ్రీనివాసరావు, తిరుమల రావు తదితరులు పెళ్లి వేడుకలు పాల్గొన్నారు.
