వ్యసాయ ఉత్పత్తులు మద్దతు ధరకు అమ్ముకోవాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. రైతులు పండించి ఏ వంటకైనా వంట రకం, నాణ్యత, దిగుబడుల, వినియోగం అంతర్జాతీయ ధరలు ఎగుమతులు, దిగుమతులు ఆధారంగా ధరలు మారుతూ ఉంటాయని అన్నారు. మార్కేట్ అంచనా ధరలు క్వింటాళ్లకు వరి సాధరణ రకం రూ.2320, ఎ గ్రేడ్ రకం రూ. 2675లు మొక్కజొన్న రూ. 2460, జొన్న రూ.3120, వేరు శనగ రూ.6760, ప్రత్తి రూ. 7250, మిరవ సాధారణ రకం రూ.13,500, ప్రత్యేక రాలు రూ.17,200, వసువు రూ. 13,200, కందులు రూ. 8680, మినుము రూ.7580, పెసలు రూ. 8750, శనగ రూ. 5,820లు గా అంచనాలు వేయబడినట్లు చెప్పారు. రైతులు విషయాన్ని గమనించి మార్కేట్ వాచ్ చెయ్యాలని కోరారు. విఏఏ నాగ మల్లేశ్వరి, విఎ హెచ్ బ్రహ్మయ్యలు పాల్గొన్నారు.
