బేగంపేట ట్రాఫిక్ అడిషనల్ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన సి వేణుగోపాల్ రెడ్డి………………

బేగంపేట ట్రాఫిక్ అడిషనల్ డీసీపీగా సి. వేణుగోపాల్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీగా విధులు నిర్వహించిన సాలె రంగారావు పదవీ విరమణ చేశారు. అప్పటినుంచి ఈ స్థానం ఖాళీగా ఉంది .తాజాగా వేణుగోపాల్ రెడ్డి అడిషనల్ డిసిపి గా బాధ్యతలు స్వీకరించారు. 1991 లో ఎస్సైగా వేణుగోపాల్ రెడ్డి విధుల్లో చేరారు .ఆయన ఎస్సైగా గాంధీనగర్, రామ్ గోపాల్ పేట ,చార్మినార్, మోండా మార్కెట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల లో విధులు నిర్వహించారు. అనంతరం ఇన్స్ పెక్టర్ గా బోయిన్పల్లి, చార్మినార్ ,హైదరాబాద్ సిటీ స్పెషల్ బ్రాంచ్ లలో ఆయన పనిచేశారు. అనంతరం డిఎస్పీగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లో పనిచేశారు. సైఫాబాద్ ట్రాఫిక్ ఏసిపిగా విధులు నిర్వహించారు. అనంతరం మేడ్చల్ ట్రాఫిక్
అడిషనల్ డి సి పి గా విధులు నిర్వహించారు. తాజాగా బేగంపేట ట్రాఫిక్ అడిషనల్ డీసీపీగా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా నగర పోలీస్ కమిషనర్ సి వీ. ఆనంద్ ని వేణుగోపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కృతజ్ఞతలు తెలియజేశారు. వేణుగోపాల్ రెడ్డి సేవా పథకం ఉత్తమ సేవ పథకం ఇండియన్ పోలీస్ మెడల్ (ఐపిఎం) పొందారు .ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి ని బేగంపేటలోని ఆయన కార్యాలయంలో నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసిపి జి శంకర్రాజు కలిసి శాలువాతో సత్కరించి బొకే అందజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *