యోగ ధ్యానం తో మెరుగైన ఆరోగ్యం సాధ్యమని ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు అన్నారు. తూర్పుగంగవరంలో యోగ గురూజీ శ్రీరామ్ ఆధ్వర్యంలో ఆదివారం యోగ 12 రోజుల యోగ శిక్షణా కార్యక్రమం ప్రారంభించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు ముఖ్య అతిథిగా పాల్గొని యోగ ప్రాముఖ్యతను వివరించారు. డాక్టర్ స్వామి, ఎఈ వీర బ్రహ్మం పలువురు ప్రముఖలు పాల్గొని యోగ, ధ్యానం ప్రాధాన్యతను వివరించారు.

