స్వచ్ఛ ఆంధ్ర లో బాగంగా స్వచ్ఛ కార్పోరేషన్లో మంజూరు అయిన ట్రాక్టర్లను దర్శి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్లు ఆయా పంచాయితీలకు అందజేయ నున్నట్లు ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు తెలిపారు. మండలంలో లక్కవరం, నాగంబొట్ల పాలెం, శివ రామపురం బొద్దికూరపాడు పంచాయతీలకు స్వచ్చ కార్పోరేషన్ ద్వారా ట్రాక్టర్లు మంజూరు అయ్యాయి. కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మి రెడ్డి ఓబులు రెడ్డి, కాగం కొండా రెడ్డి, మేడగం వెంకటేశ్వర రెడ్డి, రాచకొండ వెంకట రావు లు ఒక ప్రకటనలో కోరారు.
నేడు పంచాయితీలకు ట్రాక్టర్లు అందజేత
03
Mar