చింతల పాలెం ఉమ్మడి గడ్డ భూ ఆక్రమణ ఎస్సీ, ఎస్టీ లపై దాడి నేపధ్యంలో నమోదు అయిన కేసులో ముద్దాయిలను దర్శి డీఎస్పీ లక్ష్మి నారాయణ విచారించారు. బాధితులు ఎండ్ల మల్లయ్య ముఠాను ఆరెస్ట్ చెయ్యాలని, న్యాయం చెయ్యాలని పలు మార్లు విన్నవించారు. రాజకీయ నేపథ్యంలో కేసు నీరు కార్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో దళిత నాయకులు నీలం నాగేంద్రం, దార అంజయ్యలు పలుమార్లు ఉన్నతాధికారులను కలిసి కేసు ప్రాముఖ్యతను, బాధితుల బాధను వివరించారు. బాధితులను విచారించేందుకు సోమవారం దర్శిలో డీఎస్పీ కార్యాలయం లో హాజరు అయి పరిస్థితిని వివరించినట్లు మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దార అంజయ్య తెలిపారు. దళిత నాయకులు కాకుమాను రవి, బాధితులు వేము బాలమ్మ ఇట్టా రూతమ్మ, కోటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు
