ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలో దారం వారి పాలెంలో పలువురు కార్యకర్తలను, నాయకులకు వైసీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి సోమవారం పరామర్శించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ కాలనీకి చెందిన ఎం ఆంజనేయులు, మంచాల నారప రెడ్డి, మారం రామి రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో సర్పంచి మంచాల వెంకటేశ్వర రెడ్డి, వైస్ ఎంపీపీ మంచాల ఎన్ నాగార్జున రెడ్డి, మాజీ ఎంపీపీ పోశం మధు సూదన రెడ్డి, పార్టీ అధ్యక్షుడు టివీ సుబ్బా రెడ్డి, సర్పంచిల సంఘం అధ్యక్షుడు మారం ఇంద్రసేనా రెడ్డి, కుమ్మిత జయ రామి రెడ్డి, మారం వెంకటేశ్వర్ రెడ్డి స్థానిక నాయకులు ఉన్నారు.



